- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో మార్పులు చేయాలి.. సీఎంను కోరిన టీఎస్ మెసా
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో జారీ చేయనున్న హెల్త్ కార్డుల విషయంలో మార్పులు, చేర్పులు చేపట్టాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది.

దిశ, హైదరాబాద్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో జారీ చేయనున్న హెల్త్ కార్డుల విషయంలో మార్పులు, చేర్పులు చేపట్టాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఎస్ మెసా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు జారీ చేయనున్న ఆరోగ్య కార్డుల మార్గదర్శకాలు గందరగోళంగా ఉన్నాయన్నారు. ఉద్యోగుల వేతనాల నుండి కోతలు విధించి జారీ చేసే కార్డులలో ఆయూష్, హోమియో, యునానీ హాస్పిటల్స్ లేవన్నారు . అంతేకాకుండా హెల్త్ కార్డులు అంగీకరించే హాస్పిటల్స్ లో ఓపీ సేవలకు డబ్బులు చెల్లించాలనే విషయంలో స్పష్టత లోపించిందని , ఐపీ , ఓపీలు ఇలా అన్ని సేవలను క్యాష్ లెస్ ట్రీట్మెంట్ తో జరిగేలా చూడాలని ఆయన సీఎంను కోరారు. అత్యవసర పరిస్థితులలో వెల్ నెస్ సెంటర్‌కు వెళ్లి రాయించుకుంటేనే ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యం అందించడమంటే రోగికి ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవడమేనన్నారు. ప్రభుత్వం హెల్త్ కార్డుల కోసం ఉద్యోగుల వేతనాల నుండి 1.5 శాతం మొత్తాన్ని కోత విధిస్తోందని, అందరికీ మెరుగైన వైద్యం అందించేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఫారూఖ్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు.






