చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీ తెలంగాణకే తలమానికం: కలెక్టర్ హరిచందన దాసరి

by Kodari Anjali |

చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ తెలంగాణ కే తలమానికమని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు.

చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీ తెలంగాణకే తలమానికం: కలెక్టర్ హరిచందన దాసరి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ తెలంగాణ కే తలమానికమని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. ఈ మేరకు బుధవారం కోఠిలోని యూనివర్శిటీ దర్బార్ హాల్లో నూతన భవనాల నిర్మాణాలు, పాత భవనాల పునరుద్ధరణ, తదితర అంశాలపై వీసీ సూర్య ధనుంజయ్, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. అంతకుముందు యూనివర్సిటీలో నూతనంగా చేపట్టే అకాడమిక్ బ్లాక్, హాస్టల్, ఆడిటోరియం, స్పోర్ట్స్ బ్లాక్, గెస్ట్ హౌస్ , రంగ్ మహల్, సిమెంట్రీ, హెజ్రా హౌస్ ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శినికత, ఆలోచనలకు అనుగుణంగా విశ్వ విద్యాలయ అభివృద్ధి, మహిళా శక్తి ని మరింతగా ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు.

నూతన భవనాల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వీటితో పాటు పాత భవనాల పునరుద్ధరణ పనులను త్వరితగతిన చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున నిర్దేశించిన సమయానికి నాణ్యతతో కూడిన పనులను పూర్తిచేయాలన అన్నారు. యూనివర్సిటీలో విద్యార్థినుల సంఖ్య 7వేలకు పైగా ఉందని, వసతి గృహంలో దాదాపు వెయ్యికి పైగా విద్యార్థినులు ఉంటున్నారని, వివిధ విభాగలలో అధ్యాపకులు ఐదు వందల వరకు ఉన్నారని కలెక్టర్ కు ప్రిన్సిపాల్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ లోక పావని, ఆర్డీవో రామకృష్ణ, ఈ ఈ అనిత, డి ఈ ఆశీర్వాదం, డాక్టర్ అరుణ, డాక్టర్ విజయలక్ష్మి, వివిధ విభాగాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story