- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyd: యూట్యూబ్ వీడియోలు చూసి...!
మహిపాల్...ఆన్లైన్గేముల్లో ఉన్నదంతా పోగొట్టుకున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద అయినకాడికి అప్పులు చేశారు...

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో/శేరిలింగంపల్లి: మహిపాల్...ఆన్లైన్గేముల్లో ఉన్నదంతా పోగొట్టుకున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద అయినకాడికి అప్పులు చేశారు. బాకీలు తీర్చాలని ఒత్తిడి రావటంతో చెయిన్ స్నాచింగులు మొదలుపెట్టారు. దీనికోసం యూట్యూబ్‌లో వీడియోలు చూసి మరీ రాటుదేలి వరుసగా నేరాలకు పాల్పడుతూ చివరకు మాదాపూర్ పోలీసుల చేతికి చిక్కారు.
మాదాపూర్డీసీపీ సందీప్‌రావు సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చిన్నకొర్పోల్ గ్రామానికి చెందిన మహిపాల్(27) ఉపాధి కోసం కొంతకాలం క్రితం హైదరాబాద్వచ్చారు. మొదట కొన్నాళ్లు డ్రైవర్‌గా పని చేసి ఆ తరువాత ఓ ఫర్నీచర్ షాపులో ఉద్యోగం చేశారు.
అయితే ఆన్లైన్లో జూదం ఆడటానికి అలవాటు పడ్డ మహిపాల్సంపాదించిన డబ్బు మొత్తం పోగొట్టుకున్నారు. అయినా అలవాటును మాత్రం మానుకోలేకపోయారు. మిత్రులు, బంధువుల వద్ద పెద్ద మొత్తాల్లో అప్పులు చేసి మరీ ఆన్లైన్జూదం ఆడి ఆ డబ్బు కూడా పోగొట్టుకున్నారు. అదే సమయంలో అతనికి అప్పులు ఇచ్చిన స్నేహితులు, బంధువులు బాకీలు తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చారు.
యూ ట్యూబ్‌లో వీడియోలు చూసి...
దీంతో చేసిన అప్పులు తీర్చుకోవటంతోపాటు డబ్బు సంపాదించటానికి చెయిన్ స్నాచింగులు చేయాలని మహిపాల్నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో యూట్యూబ్ ఛానల్లో చెయిన్ స్నాచింగులకు సంబంధించిన వీడియోలు చూసి రాటుదేలారు. మార్నింగ్ వాక్‌కోసం ఇళ్లలో నుంచి బయటకు వచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకుని నేరాలు చేయటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే బోరబండ వివేకానందనగర్ నివాసి ఆర్.కున్నమ్మ (53) గతనెల 28న సాయంత్రం 6.15గంటల సమయంలో భర్త వల్లభయ్యతో కలిసి వాకింగ్‌చేస్తూ పర్వత్నగర్వైపు వెళుతుండగా ఆమె మెడలోని నాలుగు తులాల మంగళసూత్రాలు తెంచుకుని ఉడాయించారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా మాదాపూర్డీఐ వెంకట్, సీఐ తిరుపతి, సీసీఎస్సీఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి రంగంలోకి దిగి మహిపాల్‌ను సోమవారం అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు ఏప్రిల్13న అల్లాపూర్గాయత్రినగర్ నివాసి సత్యవతి మెడలో నుంచి 3తులాల బంగారు గొలుసును తెంచుకుని ఉడాయించినట్టు వెల్లడైంది. ఈ క్రమంలో పోలీసులు నిందితుడి నుంచి రెండు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు






