నేడే రెండో టీ20 మ్యాచ్‌..టైమింగ్స్ లో మార్పులు !

by velandi.Saikiran |

నేడే ఇంగ్లండ్, భార‌త్ మ‌ధ్య‌ రెండో టీ20 మ్యాచ్ జ‌రుగ‌నుంది.

నేడే రెండో టీ20 మ్యాచ్‌..టైమింగ్స్ లో మార్పులు !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నేడు రెండో టీ20 జరగనుంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటల సమయంలో ఈ మ్యాచ్ షురూ అవుతుంది. ఇంగ్లాండ్ తో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ మ్యాచ్ పై ఫోక‌స్ చేసింది భార‌త్. అంతేకాదు ఈ మ్యాచ్ లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ డెబ్యూ చేస్తాడని అంటున్నారు. ఈ మేరకు అతడు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఇక్కడి పిచ్ బౌలింగ్, బ్యాటింగ్ కు సమతూకంగా ఉంటుందని చెబుతున్నారు. మొదటి మ్యాచ్ తరహాలోనే ఈ మ్యాచ్ కు కూడా వర్షం విలన్ గా మారే ప్రమాదం గురించి ఉన్నట్లు సమాచారం. దీంతో ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు. వరుణ దేవుడు కరుణించాలని కోరుతున్నారు.

ఇరు జ‌ట్లు

భారత జట్టు అంచ‌నా: సంజూ శాంసన్ / వైభ‌వ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (w), శ్రేయాస్ అయ్యర్ (c), తిలక్ వర్మ, శివమ్ దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్ర‌వ‌ర్తి, ప్రిన్స్ యాదవ్.

ఇంగ్లండ్ (ఆడే జట్టు): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్

Next Story