- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ, ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్లు పేర్కొంది. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, అదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట లాంటి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
అల్పపీడనం ప్రభావంతో నేడు అల్లురి, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం,మన్యం,అల్లూరి, పోలవరం,పల్నాడు జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తరుణంలోనే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.






