ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్

by Malleboina Mahesh |   (  Updated:2026-07-04 02:18:38  IST  )

20 రోజుల విరామం తర్వాత నేటి నుండి పాపికొండల బోటింగ్ యాత్ర పునఃప్రారంభం.. రాజమండ్రి, భద్రాచలం మార్గాల ద్వారా బోటు సేవలకు అధికారుల గ్రీన్ సిగ్నల్!

ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తీపి కబురు అందించింది. సాంకేతిక, భద్రతా కారణాల వల్ల గత 20 రోజులుగా తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రసిద్ధ పాపికొండల విహారయాత్ర (Papikondalu Boat Tour) నేటి నుంచి (జూలై 4, 2026) నుంచి పునఃప్రారంభం కానుంది. బోట్ల ఫిట్‌నెస్, ప్రయాణికుల భద్రతా ప్రమాణాలపై అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అనంతరం, యాత్రను తిరిగి ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుదీర్ఘ విరామం తర్వాత గోదావరి అలలపై బోటు షికారుకు మార్గం సుగమం కావడంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాజమండ్రి, భద్రాచలం మార్గాల ద్వారా సేవలు సిద్ధం

అధికారుల నివేదిక ప్రకారం.. కఠినమైన తనిఖీల తర్వాత మొత్తం 15 ప్రైవేట్ బోట్లతో పాటు ఏపీటీడీసీ (APTDC) కి చెందిన ఒక అధికారిక బోటుకు మాత్రమే పర్యాటక శాఖ అనుమతులు మంజూరు చేసింది. నేటి నుండి రాజమండ్రి పుష్కర ఘాట్ (గండిపోశమ్మ ఆలయ పాయింట్), భద్రాచలం సమీపంలోని పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి పాపికొండల విహారయాత్రలు అధికారికంగా షెడ్యూల్ ప్రకారం సాగనున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో పర్యాటకుల రక్షణే ధ్యేయంగా ప్రతి బోటులోనూ లైఫ్ జాకెట్లు, అత్యవసర రెస్క్యూ సిబ్బందిని తప్పనిసరి చేశారు. గోదారమ్మ ఒడిలో పచ్చని కొండల అందాలను వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి పర్యాటకులు ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా బుకింగ్స్ చేసుకుంటున్నారు.

Next Story