- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సంస్థ చేతికి 'హృదయం మురళి' తెలుగు థియేట్రికల్ హక్కులు
అథర్వ మురళి నటించిన 'హృదయం మురళి' తెలుగు వెర్షన్ హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దక్కించుకుంది.

దిశ, వెబ్ డెస్క్: అథర్వ మురళి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'హృదయం మురళి'. ఈ చిత్రంలో ప్రీతి ముఖుందన్, కాయడు లోహర్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆకాష్ భాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించగా, డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు వెర్షన్‌ను జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే, ఈ సినిమా తెలుగు వర్షన్ ను మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి సంస్థకు ఉన్న బలమైన పంపిణీ వ్యవస్థ కారణంగా ఈ సినిమాకు మంచి స్థాయిలో థియేటర్లు లభించే అవకాశం ఉంది. ఇక తెలుగు వెర్షన్‌కు మంచి టాక్ వస్తే, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






