- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరులో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
by Ramesh Naini |
బెంగళూరులోని జ్ఞాన భారతి మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం కేరళ ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరులోని జ్ఞాన భారతి మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం కేరళ ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేరళలోని పయ్యన్నూరు నుంచి బెంగళూరుకు వస్తున్న బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగి, అవి వేగంగా బస్సు ముందు భాగం, లోపలి భాగానికి వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్‌తో పాటు బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు వెంటనే కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమికంగా షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నప్పటికీ, అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






