ఆ అరుదైన మైలురాయికి అతి దగ్గరగా 'మా ఇంటి బంగారం'

by Pulgam srinivas |

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 92 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన 'మా ఇంటి బంగారం' రూ. 100 కోట్ల మార్క్‌కు చేరువైంది.

ఆ అరుదైన మైలురాయికి అతి దగ్గరగా మా ఇంటి బంగారం
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. జూన్ 19న విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో అద్భుతమైన ఓపెనింగ్స్ లభించాయి. అనంతరం కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఇప్పటికే ఈ చిత్రం భారీ లాభాలను అందుకుని, ఈ ఏడాది అత్యంత విజయవంతమైన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన మైలురాయికి చేరువైంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 92 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

వీకెండ్ కావడంతో పాటు నిన్నటి నుంచి టికెట్ ధరలను కూడా తగ్గించడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ వీకెండ్‌లోనే రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి 'మా ఇంటి బంగారం' చేరుతుందా? అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.




Next Story