Today's Horoscope:ఈరోజు రాశి ఫలాలు(04-07-2026)

by Jakkula.Mamatha |

చంద్రుడి సంచారం, 'చంద్రాధి యోగం' మరియు రోహిణి నక్షత్రంలోకి కుజుడి ప్రవేశం వల్ల ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

Todays Horoscope:ఈరోజు రాశి ఫలాలు(04-07-2026)
X

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలో శనివారం నాడు చంద్రుడి సంచారం, 'చంద్రాధి యోగం' మరియు రోహిణి నక్షత్రంలోకి కుజుడి ప్రవేశం వల్ల ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

మేష రాశి

ఈ రాశి వారికి ఇవాళ సాధారణ ఫలితాలు ఉండబోతున్నాయి. కోరుకునేది ఒకటి, జరిగేది మరొకటి అయ్యే సూచనలు ఉన్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఆలస్యంగా అందుతుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి, సమయానికి భోజనం చేయడం ముఖ్యం. మనోనిగ్రహం అవసరం. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

వృషభ రాశి

ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సన్నిహితులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో మీ ప్రయత్నాలు సఫలమై విజయం లభిస్తుంది.

మిథున రాశి

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. డబ్బు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల రుణ ప్రయత్నాలు చేయవలసి రావచ్చు. కుటుంబంలో స్వల్ప విభేదాలు లేదా ఆందోళనలు ఉండే అవకాశం ఉంది. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి.

కర్కాటక రాశి

స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పెండింగ్‌లో ఉన్న పాత బాకీలు వసూలవుతాయి. నూతన పనులపై ఆసక్తి చూపుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబంతో కలిసి దైవ దర్శనం చేసుకునే సూచనలు ఉన్నాయి.

సింహ రాశి

ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడండి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో విభేదాలకు తావివ్వకండి.

కన్య రాశి

సమాజంలో గౌరవం పొందుతారు. అయితే పనులన్నీ కొద్దిగా ఆలస్యంగా పూర్తి కావడం వల్ల కొంత మానసిక ఆందోళన ఉంటుంది. వృత్తిరీత్యా సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అనవసర విమర్శలకు దూరంగా ఉండండి.

తుల రాశి

ఈ రాశి వారికి ఇవాళ చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యాపార రంగంలో లాభాలు కనిపిస్తున్నాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. అయితే వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయడం వల్ల అలసట, ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి

ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

ధనుస్సు రాశి

కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. గతంలో వాయిదా పడిన పనులన్నీ ఈరోజు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి లాభసాటిగా ఉంటుంది.

మకర రాశి

ఈ రాశి వారిని ఆర్థిక ఇబ్బందులు కొంత సతమతం చేయవచ్చు. ఆత్మీయులు, మిత్రుల సహకారం ఆలస్యంగా అందుతుంది. ప్రయాణాల సమయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా కీళ్ల నొప్పులు మరియు అజీర్ణ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

కుంభ రాశి

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సమాజంలో గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీల మూలంగా లాభాలు పొందుతారు. బంధుమిత్రుల నుంచి మంచి గౌరవం లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. సత్కార్యాలలో పాల్గొంటారు.

మీన రాశి

ఈ రాశి వారికి ఇవాళ సానుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఓపికగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి అప్పులు చేయాల్సి రావచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మిత్రుల సహాయం ఆలస్యంగా అందుతుంది.

Next Story