- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'అమవాస్య' రోజు చైన్ స్నాచింగ్.. ఇన్వెస్టిగేషన్ లో ఇంట్రెస్టింగ్..!
ఏప్రిల్ 17న తెల్లవారుజామున హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 4 కరూర్ వైశ్య బ్యాంకు వద్ద జరిగిన చైన్ స్నాచింగ్ సంఘటనను ఛేదించే విషయంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్వెస్టిగేషన్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ లభించింది.

దిశ, సిటీక్రైం : సాధారణంగా అమవాస్య రోజు బంగారం అమ్మకం, కొనుగోలు ఎవ్వరూ చేయరు. ఏప్రిల్ 17న తెల్లవారుజామున హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 4 కరూర్ వైశ్య బ్యాంకు వద్ద జరిగిన చైన్ స్నాచింగ్ సంఘటనను ఛేదించే విషయంలో పోలీసులు అమవాస్య రోజు చోరీ బంగారం ఎవ్వరూ కొంటారో కోణంలో ఆలోచన చేయడంతో కొంత లీడ్ వచ్చినట్టు సమాచారం. అన్ని కోణాల్లోని సమాచారంతో సీసీ కెమెరాలు, సాంకేతికతో పోలీసులు పని చేయడంతో దాదాపు 24 గంటల్లోనే ఛైన్ స్నాచర్ లతో పాటు చోరీ బంగారం కొనుగొలు చేసిన రిసీవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్మాప్తులో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 17న ఉదయం 5.30 గంటలకు- హబ్సిగూడ స్ట్రీట్ నెంబరు 4 లో వాకింగ్ చేస్తున్న వ్రుద్ధురాలి మెడ మీద నుంచి అంబర్ పేట్ ప్రాంతానికి చెందిన హేమంత్, దీపక్, షంకురియా మూడున్నర తులాల బంగారం గొలుసును తెంపుకుని పారిపోయారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు-స్నాఛింగ్ చేసిన బంగారం గొలుసును ముగ్గురు కలిసి మూడు ముక్కలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు- మూడు ముక్కలు చేసిన బంగారం గొలుసును భగత్ సింగ్ నగర్ కు చెందిన కె.రామాచారీ కి 1.20 లక్షలకు అమ్మేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు- 1.20 లక్షలను తీసుకువెళ్లి స్థానికంగా ఉన్న బైక్ షోరూం లో పల్సర్ ఎన్.160 బైక్ ను కొనుగొలు చేశారు. నెక్స్ట్ టార్గెట్--కొనుగొలు చేసిన కొత్త బైక్ మీద మరికొన్ని ఛైన్ స్నాఛింగ్ లు చేయాలని టార్గెట్ పెట్టుకుని స్నాఛర్ లు ప్లాన్ రెడీ చేసుకున్నారు. వేగంగా స్పందించిన పోలీసులు.. స్నాఛింగ్ సంఘటన జరిగిన వెంటనే టాస్క్ ఫోర్స్, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు రంగంలోకి నిరంతరం ప్రాధమిక ఆధారాలతో వెంటాడడంతో మరికొన్ని స్నాఛింగ్ సంఘటనలు చోటు చేసుకోక ముందే ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో ఈ స్నాఛర్ ల ఆగడాలకు చెక్ పడింది. అమావాస్య రోజు జరిగిన చైన్ స్నాచింగ్ సంఘటన పోలీసు వర్గాల్లో ఇంట్రెస్టింగ్ స్టోరీగా మారింది. అరెస్టైన ముగ్గురు స్నాచర్లు గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని పోలీసుల దర్మాప్తులో వెల్లడైంది. గంజాయితో పాటు ఇతర చెడు వ్యసనాలకు బానిసైన ఈ ముగ్గురు స్నాచింగ్ లతో పాటు ఇతర చోరీలకు పాల్పడ్డారని తేలింది. ఈ స్నాచర్ లను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.






