- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad : ఉద్యోగిని కిడ్నాప్ చేసిన సీఈవో
తనవద్ద పనిచేసిన ఉద్యోగినే స్వయంగా కంపెనీ సీఈవో కిడ్నాప్ చేసిన ఘటన హైదరాబాద్(Hyderabad) లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : తనవద్ద పనిచేసిన ఉద్యోగినే స్వయంగా కంపెనీ సీఈవో కిడ్నాప్ చేసిన ఘటన హైదరాబాద్(Hyderabad) లో చోటు చేసుకుంది. నగరంలోని బంజారాహిల్స్ లోని సుచిర్ ఇండియా ఇన్ఫ్రాటెక్(Suchir India Infratech) కంపెనీ సీఈవో ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సుచిర్ ఇండియా కంపెనీ వరంగల్ బ్రాంచిలో ప్రియాంక్ అనే వ్యక్తి గత జనవరిలో మేనేజర్ గా జాయిన్ అయ్యాడు. అయితే సోమవారం కంపెనీ రివ్యూ మీటింగ్ ఉందని ప్రియాంక్ ను పిలవగా, అతడు బంజారాహిల్స్ ఆఫీసుకు చేరుకున్నాడు. అనంతరం కంపెనీ సీఈవో, జీఎంలు కలిసి ప్రియాంక్ ను వారి నివాసానికి తీసుకువెళ్ళి బంధించాడు.
కంపెనీ లెక్కల్లో రూ. 5 లక్షలు తేడా వచ్చిందంటూ, అవేం చేశావో చెప్పాలంటూ సాయంత్రం వరకు ప్రియాంక్ పై దాడికి పాల్పడ్డారు. కాగా తనను కిడ్నాప్ చేసి, హింసిస్తున్న విషయాన్ని ప్రియాంక్ రహస్యంగా వరంగల్ లో ఉన్న అతని బంధువుకు సమాచారం అందించగా.. వెంటనే అతను డయల్ 100 కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి ప్రియాంక్ ను విడిపించారు. ఈ వ్యవహారంలో కంపెనీ జీఎం, సీఈవోలపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.






