- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంజనీకుమార్‌ను వెంటనే రిలీవ్ చేయండి: కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు
అంజనీకుమార్‌ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది...

దిశ, వెబ్ డెస్క్: డీజీ అంజనీకుమార్(DG Anjani Kumar)ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ(Central Home Ministry) ఆదేశాలు జారీ చేసింది. ఏపీ కేడర్ ఐపీఎస్(AP Cadre IPS)గా ఉన్న అంజనీకుమార్‌తో పాటు అభిలాష బిస్త్(Abhilash Bist), అభిషేక్ మహంతి(Abhishek Mahanty)కు సైతం రిలీవ్ ఆర్డర్స్ వచ్చాయి. ప్రస్తుతం కరీంనగర్ సీపీగా మహంతి ఉండగా తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా బిస్త్ పని చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురిని ఏపీ కేడర్‌లో రిపోర్టు చేయాలని ఎమ్‌హెచ్ఏ ఆదేశించింది.
కాగా రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఐదుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్‌లను ఏపీకి కేటాయించారు. అయితే వాళ్లు తెలంగాణలోనే కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో ఐఏఎస్ అధికారులను ఏపీకి పంపారు. ఐఏఎస్ అధికారులు అమ్రాపాలి, వాణీ ప్రసాద్, వాకాటి కారుణ, రొనాల్డ్ రాస్, ప్రశాంతి ఏపీలో సేవలు అందిస్తున్నారు. మిగిలిన ముగ్గురు ఐపీఎస్‌లు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి వెళ్లాల్సి ఉంది. తాజాగా వీరిని రిలీవ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.






