- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీసీ కెమెరా ఆధారంగా ఛేదించిన కిడ్నాప్ మిస్టరీ – చాంద్రాయణగుట్ట పోలీసుల చాకచక్యం
ఐదేళ్ల బాలిక ను కిడ్నాప్ చేసి రూ. 1.30 లక్షలకు విక్రయించిన ఘటనలో ఐదుగురిని చాంద్రాయణ గుట్ట పోలీసులు అదుపులో కి తీసుకొని గురువారం రిమాండ్ కు తరలించారు.

దిశ, చార్మినార్ : ఐదేళ్ల బాలిక ను కిడ్నాప్ చేసి రూ. 1.30 లక్షలకు విక్రయించిన ఘటనలో ఐదుగురిని చాంద్రాయణ గుట్ట పోలీసులు అదుపులో కి తీసుకొని గురువారం రిమాండ్ కు తరలించారు. చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎసీపీ మనోజ్ కుమార్, ఇన్ స్పెక్టర్ గురునాథ్ లతో కలిసి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ వివరాలు వెల్లడించారు. పాతబస్తీ బార్కాస్ కు చెందిన అక్రమ్ సాధి కూతురు మరియం భాను (5). తన పెద్దనాన్న బాబా సాధిని ఈ నెల 20వ తేదీన చాక్లేట్ లు ఇప్పించాలని మరియం భాను మారం చేయడంతో బైక్ మీద కూర్చో బెట్టుకొని సమీపంలోని భ్రమరాంబ వైన్స్ కి వెళ్లారు. అక్కడ ఆయన మద్యం సేవించే వరకు మరియం కూడా అక్కడే ఉంది. చిత్తుగా మద్యం సేవించిన ఆమె పెద్దనాన్నతో కలిసి రోడ్డు మీదకు వచ్చింది.
ఆయన మద్యం మత్తులో రోడ్డు మీద కింద పడ్డాడు. దీంతో అతని పక్కనే మరియం ఏమి చేయాలో తెలియని దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. ఇంతలోనే బైక్ పై వచ్చిన ఓ జంట ఆ పాపను కిడ్నాప్ చేశారు. ఎంత సేపటికి తన కూతురుతో పాటు అన్న రాకపోవడంతో ఆమె తండ్రి ఆందోళనకు గురయ్యారు. మద్యం మత్తు దిగాక అతను అర్థరాత్రి ఆలస్యంగా ఒక్కడే ఇంటికి చేరుకున్నాడు. తన కూతురు ఏదని అన్న ను ప్రశ్నించగా ఇంకా ఇంటికి రాలేదా? అని ఎదురు ప్రశ్నించాడు. వెంటనే అక్రమ్ సాధి కుటుంబ సభ్యులతో కలిసి చాంద్రాయణ గుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. డివిజన్ ఎసీపీ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్ స్పెక్టర్ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. చాంద్రాయణగుట్ట వైన్స్ నుంచి సిసి కెమెరాలను పరిశీలించారు. ఒక జంట యాక్టివా బైక్ పై చాంద్రాయణ గుట్ట లోని భ్రమరాంబ వైన్స్ కు అతని తలకు హెల్మెట్, ఆమె బురఖా ధరించడం తో పాటు బైక్ నెంబర్ ప్లేట్ కనిపించకుండా ఒక వస్త్రం కప్పి పాప కిడ్నాప్ కు పాల్పడినట్లు వైన్స్ దగ్గర ఉన్న సిసి కెమెరాలో పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి బైక్ మీద ఆ పాపను తీసుకొని బాలాపూర్, మల్లాపూర్, కుర్మల్ గూడ, షరీఫ్ నగర్ కు బైక్ మీద వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సహాయంతో ఆ జంటను సలీం నగర్ కాలనీకి చెందిన సయ్యద్ జావిద్ పాషా (51), షరీఫ్ నగర్ కు చెందిన షస్తా పర్వీన్ (40) లు భార్య భర్తలుగా పోలీసులు గుర్తించారు.
వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు తమ దైన స్టైల్ లో విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. మరియం (5) ను రూ. 1.30 లక్షలకు ఉప్పల్ చిలుకా నగర్ కు చెందిన పర్వీన్ భాను (40) కు విక్రయించింది. ఆమె అదే ప్రాంతానికి చెందిన క్లినిక్ నడిపే జావాగి సునీత కుమారి (50), బంజారా హిల్స్ లో నోవా పర్టీలిటి సెంటర్ లో ఏజెంట్ గా పనిచేసే కప్పల రాజేంద్ర ప్రసాద్ (39) లకు బాలికను విక్రయించడానికి బేరం కుదుర్చుకుంది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి బాలికను సురక్షితంగా రక్షించి తల్లి దండ్రులకు అప్పగించారు. సునీతా కుమారీ, రాజేంద్రప్రసాద్ లు గతంలో ఈస్ట్ ముంబాయి విక్రోలీ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇదే తరహాలో చిన్నారులను విక్రయిస్తూ పోలీసులకు చిక్కి జైలు జీవితం అనుభవించారు. ఇలా ఈ ఐదుగురు కలిసి ముఠా గా ఏర్పడి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. గతంలో చేసిన ఇలాంటి కిడ్నాప్ల విషయమై దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాలిక ను కిడ్నాప్ విక్రయించిన ఘటనలో సయ్యద్ జావీద్ పాషా, పర్వీన్, పర్వీన్ భాను, సునీత రావు, రాజేంద్ర ప్రసాద్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి యాక్టివ బైక్, ఒక ఆటో, ఐదు సెల్ఫోన్ లు, ఒక ఆల్టో కారు, రూ.76 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






