జూబ్లీహిల్స్ బై పోల్.. భారీగా నగదు, లిక్కర్ సీజ్

by Naga Rani Yarlagadda |

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. నవంబర్ 11వ తేదీన ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది.

జూబ్లీహిల్స్ బై పోల్.. భారీగా నగదు, లిక్కర్ సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. నవంబర్ 11వ తేదీన ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈక్రమంలో శుక్రవారం (నవంబర్ 7) ఉదయం వరకూ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు నిర్వహించిన తనిఖీల్లో రూ.3.3 కోట్ల నగదు, 701 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేశాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఉల్లంఘనకు సంబంధించి 24 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఏడు కేసులు అనుమతి లేకుండా నిర్వహించిన సమావేశాలు, ప్రసంగాలపై నమోదయ్యాయి. ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ.4,74,322 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 0.11 గ్రాముల MDMAతో సహా 2,454 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా.. వాటి విలువ రూ.1,97,600 ఉంటుందని తెలిపారు.

Next Story