- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad : జూబ్లీహిల్స్ బేబిలాన్ పబ్ పై కేసు నమోదు
హైదరాబాద్(Hyderabad)లోని జూబ్లీహిల్స్(Jublihills)లో ఉన్న బేబిలాన్ పబ్(Babylon Pub) పైన కేసు నమోదు(Case Filed) చేశారు పోలీసులు.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లోని జూబ్లీహిల్స్(Jublihills)లో ఉన్న బేబిలాన్ పబ్(Babylon Pub) పైన కేసు నమోదు(Case Filed) చేశారు పోలీసులు. పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మీనల్(Social Media Influencer Minal), తన తల్లి, చెల్లితో కలిసి ఈ పబ్‌కు వెళ్లింది. వారు ఆర్డర్ చేయని డ్రింక్స్‌కు బిల్ వేసి, డబ్బులు చెల్లించాలని పబ్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ విషయంపై మీనల్ వారిని నిలదీయడంతో, సిబ్బంది లైట్స్ ఆపి, మీనల్ తల్లి, చెల్లిపై దాడి చేశారని ఆమె ఆరోపించింది.
ఈ ఘటనపై మీనల్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్(Jublihills PS)లో ఫిర్యాదు చేయగా.. ఆమె ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు బేబిలాన్ పబ్ సిబ్బందిపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని పబ్‌లలో కస్టమర్ల భద్రత, నిర్వహణపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.






