- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బేగంపేట ఫ్లై ఓవర్ పై కారు బోల్తా.. నలుగురికి గాయాలు
by Ratna Kumari |
బేగంపేట ఫ్లై ఓవర్ పై బుధవారం వేగంగా వెళ్తున్న కారు డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది.

X
దిశ, బేగంపేట : బేగంపేట ఫ్లై ఓవర్ పై బుధవారం వేగంగా వెళ్తున్న కారు డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. దీంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సమాచారం. ప్రమాదంతో కొంతసేపు బేగంపేట ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా.. పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ప్రమాదానికి గురైన కారును అక్కడి నుంచి తొలగించి వాహనాల రాకపోకలను సజావుగా కొనసాగించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






