హైదర్ షాకోట్‌లో ఘోర ప్రమాదం.. హైస్పీడ్‌లో దూసుకొచ్చిన మృత్యువు

by Naga Rani Yarlagadda |

హైదర్ షాకోట్‌లో శనివారం దారుణ ఘటన జరిగింది. స్థానిక చౌరస్తా వైపు వేగంగా వచ్చిన కారు.. కృష్ణ అనే వ్యక్తిని ఢీ కొట్టింది.

హైదర్ షాకోట్‌లో ఘోర ప్రమాదం.. హైస్పీడ్‌లో దూసుకొచ్చిన మృత్యువు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదర్ షాకోట్‌లో శనివారం దారుణ ఘటన జరిగింది. స్థానిక చౌరస్తా వైపు వేగంగా వచ్చిన కారు.. కృష్ణ అనే వ్యక్తిని ఢీ కొట్టింది. కారు కింద నలిగిన అతను.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇంత ఘోర ప్రమాదం జరిగినా కారును అక్కడ ఆపకుండా డ్రైవర్ పరారయ్యాడు. అందరూ చూస్తుండగానే ఈ ప్రమాదం జరగ్గా.. కారును పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ.. మితిమీరిన వేగంతో కారు పరారవ్వడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. స్థానికులు చెప్పిన వివరాలతో నార్సింగి పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీటీవీల్లో రికార్డైన ప్రమాద దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Next Story