- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బేగంపేట్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
by Kema Shiva Kumar |
హైదరాబాద్‌లోని బేగంపేట్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని బేగంపేట్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం బేగంపేట్ ఫ్లై ఓవర్‌పై హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పంజాగుట్ట వెళ్తున్న ఓ కారు అతివేగంతో ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా పల్టీలు కొట్టిన కారును ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి మరోచోటికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






