- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వనస్థలిపురంలో గంజాయి స్మగ్లర్ల పట్టివేత
వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి గంజాయి ఉన్న కవర్‌ను రోడ్డు పక్కన పడేసి పరారయ్యేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, వనస్థలిపురం : వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి గంజాయి ఉన్న కవర్‌ను రోడ్డు పక్కన పడేసి పరారయ్యేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ రవిబాబు వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి సాగర్ కాంప్లెక్స్ మెయిన్ రోడ్‌పై బీఎన్‌రెడ్డి నగర్ పరిధిలో ఎస్సై నాగరాజు తన సిబ్బందితో కలిసి వెహికల్స్ చెక్ చేస్తున్నారు. ఈ సమయంలో గుర్రంగూడ వైపు నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపేందుకు ప్రయత్నించారు. పోలీసులు చూసిన వెంటనే వారు తమ వద్ద ఉన్న ఓ కవర్‌ను రోడ్డు పక్కన పడేసి పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆ కవర్‌లో గంజాయి ఉన్నట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో సరూర్‌నగర్ హుడా కాంప్లెక్స్‌లోని సూర్య సరోజ అపార్ట్‌మెంట్స్ లో ఉండే ప్రైవేట్ ఉద్యోగి శ్యామలపల్లి కరుణ్ కుమార్ (32), అలాగే బీఎన్‌రెడ్డి నగర్‌లోని సాయిరామ్ నగర్ కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి బైలుపాటి రవికుమార్ (35)లుగా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 22 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.






