ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సీఏ చంద్రశేఖర్ వేముల ఏకగ్రీవ ఎన్నిక

by Bhanu |   (  Updated:2025-06-29 12:26:49  IST  )

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సీఏ చంద్రశేఖర్ వేముల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సీఏ చంద్రశేఖర్ వేముల ఏకగ్రీవ ఎన్నిక
X

దిశ, హిమాయత్ నగర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సీఏ చంద్రశేఖర్ వేముల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాదులో అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు సీఏ హితేశ్ జైన్ అధ్యక్షతన జరిగిన వార్షిక సాధారణ సభలో ఈ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎలెక్షన్ ఆఫీసర్ అమృత్ కుమార్ ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి.అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఏ చంద్రశేఖర్ వేముల మాట్లాడుతూ.. ట్యాక్స్ బార్ అసోసియేషన్‌ను తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మరింత బలోపేతం చేయడం, కొత్త సభ్యులను చేరదీసి అభివృద్ధి దిశగా దోహదపడడం, వర్క్‌షాప్‌లు, సెమినార్ల ద్వారా సభ్యులకు విద్యా వేదికలు కల్పించడం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.


అంతేగాకుండా, రెగ్యులేటరీ సంస్థలతో సమన్వయం, ప్రభుత్వ వేదికలపై అసోసియేషన్‌ తరఫున ప్రోఐయాక్టివ్ పాత్ర పోషిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సీఏ రాందేవ్ భుటాడా, సీఏ పూర్ణచంద్ర రావు, ఐటీపీ మధుసూదన్ బోజ్జా, సీఏ వెంకట రామ్, తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహారావు తదితరులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు.


Next Story