- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సనత్‌నగర్‌లో నిబంధనలను ఉల్లంఘిస్తున్న నిర్మాణదారులు
నిబంధనలు తుంగలో తొక్కుతూ జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో ఇష్టారాజ్యాంగా కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొందరు అధికారుల దృష్టికి రా కుండా కింది స్థాయి సిబ్బంది కొంత మంది నాయకుల అండతో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి.

దిశ, ఖైరతాబాద్ : నిబంధనలు తుంగలో తొక్కుతూ జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో ఇష్టారాజ్యాంగా కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొందరు అధికారుల దృష్టికి రా కుండా కింది స్థాయి సిబ్బంది కొంత మంది నాయకుల అండతో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని నిర్మాణాలపై వారికి ఫిర్యాదులు చేసినా ని మ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కేవ లం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మళ్లీ అటువైపు చూడ డం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడు తుంది. సరైన పద్ధతిలో ప్రభుత్వానికి రుసుముల చెల్లించి అనుమతులు పొంది తర్వాత చేపట్టాల్సిన నిర్మాణా లు కొందరు ముందుగానే నిర్మాణాలు చేపడుతున్నారు.. మరికొందరు జీ+2 అనుమతులు పొంది 4, 5, 6 అంతస్తులను నిర్మిస్తున్నారు.. కొందరు కిం దిస్థాయి అధికారులు కాసులకు కక్కు ర్తి పడి నిబంధనలను బేఖాతర్ చేస్తు న్నారు. నిర్మాణాలు అధికారుల సమన్వయంతోనే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ శాఖ ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సారించి అనుమతులు పొందకుండా అక్రమ నిర్మా ణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సుభాష్ నగర్‌లో అక్రమ నిర్మాణం
జీహెచ్ఎంసీ, ఖైరతాబాద్ సర్కిల్ 18 పరిధి సనత్‌నగర్‌లోని సుభాష్ నగర్ లో అక్రమ నిర్మాణం చేపట్టారు. అనుమతులు లేకుండా జీ+5 దీనిపై అధికారులు మాత్రం ఎలాంటి తీసుకోవడం లేదు.
లింగయ్య నగర్‌లో..
జీహెచ్ఎంసీ, ఖైరతాబాద్ సర్కిల్ 18 పరిధి సనత్ నగర్‌లోని లింగయ్య నగ ర్ కాలనీలో జీ+5 అంతస్తులు అక్రమ నిర్మాణం సాగుతుంది. ఇంతటి భారీ నిర్మాణం అధికారుల కంటపడడంలేదా? అని ప్రశ్నిస్తున్నారు. అధికారు లు చర్యలు తీసుకోకపోవడంలో ఆంత ర్యం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
శ్రీరామ్ నగర్ లో..
సనత్ నగర్ బీకే గూడ, శ్రీరామ్ నగర్, గౌతమ్ మోడల్ స్కూల్ సమీపంలో షెడ్డుతో కూడుకున్న అక్రమ నిర్మాణం జరుగుతున్నది. అధికారులు అక్రమ నిర్మాణాలపై ఎందుకంత నిర్లక్ష్య ధోర ణి చూపిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.






