కాలుష్య రహిత హైదరాబాద్ నిర్మాణానికి అందరూ కృషి చేయాలి

by Naga Rani Yarlagadda |

కాలుష్య రహిత హైదరాబాద్​నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని బీఆర్‌టీయూ నాయకులు నల్గొండ నరేందర్​సూచించారు.

కాలుష్య రహిత హైదరాబాద్ నిర్మాణానికి అందరూ కృషి చేయాలి
X
  • బీఆర్‌టీయూ నాయకులు నల్గొండ నరేందర్​
  • హరితసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటిన నాయకులు

దిశ, హైదరాబాద్ ​బ్యూరో: కాలుష్య రహిత హైదరాబాద్​నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని బీఆర్‌టీయూ నాయకులు నల్గొండ నరేందర్​సూచించారు. గురువారం తన జన్మదినం సందర్భంగా అంబర్​పేటలోని వీరన్నగుట్ట ఆలయంలో మొక్కలను నాటారు, అనంతరం ఆయన మాట్లాడుతూ.. పుట్టినరోజులు, వివాహ మహోత్సవాలు, పండుగల సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టాలన్నారు. హరితసేన అంబర్‌పేట్ నియోజకవర్గ అధ్యక్షులు నిరంజన్ పూలే మాట్లాడుతూ, హరిత సేన ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గోల్నాక డివిజన్ అధ్యక్షులు కే. సురేష్ గౌడ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఆర్‌కే బాబు మాట్లాడుతూ.. నగరంలో కాలుష్యంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, మొక్కలు నాటడం వల్ల కాలుష్యాన్ని కొంతమేర నిర్మూలించే అవకాశముందన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, ధర్మేందర్, శ్రీనివాస్, సాయికుమార్, నిమ్మల యాదగిరి, రుద్రయ్య, కృష్ణయ్య, మారుతి తదితరులు పాల్గొన్నారు.

Next Story