- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు గురువారం తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ..

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు గురువారం తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తనను అభిమానించే వారి ప్రేమ ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానన్నారు.
కేసీఆర్ బ్లెస్సింగ్స్ తీసుకున్న కేటీఆర్
తన పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి, పార్టీ అధినేత, కేసీఆర్ నుంచి కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. తన భార్య శైలిమ, పుత్రుడు హిమాన్షుతో కలిసి ఎర్రవెల్లి నివాసానికి వెళ్లారు. తన తల్లిదండ్రులను కలిసి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఆలింగనం చేసుకొని కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
నాయకులను పట్టించుకోకుండానే..
కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి భారీ ఎత్తున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. వారిలో మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు తదితరులు ఉన్నారు. అయితే.. భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో భవన్ పూర్తిగా నిండింది. దాంతో స్వల్ప తోపులాట జరిగి భవన్ అద్దాలు పగిలిపోయాయి. వెంటవెంటనే కేక్ కట్ చేసిన కేటీఆర్.. ఆ తరువాత అక్కడికి వచ్చిన నేతలను పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. దాంతో వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన నేతలంతా నిరుత్సాహానికి గురయ్యారు.
పాపం ఎర్రబెల్లి..
కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఏటా గిఫ్ట్ ఎ స్మైల్ కింద పార్టీ నేతలు తమకు తోచిన విధంగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కొంతమంది సైకిళ్లు పంపిణీ చేయగా.. మరికొంత మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. ఆర్థిక సహాయం చేశారు. అయితే.. వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం అదే ధోరణితో గురువారం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో కూడిన 3,500 హెల్మెట్లను పంపిణీ చేసేందుకు తీసుకొచ్చారు. గిఫ్ట్ ఎ స్మైల్ కింద కేటీఆర్ చేతుల మీదుగా కార్యకర్తలకు పంపిణీ చేయాలని భావించారు. ప్రత్యేక వాహనంలో వాటిని తీసుకురాగా.. కేటీఆర్ మాత్రం ఎర్రబెల్లిని పట్టించుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో ఆయన నారాజ్ అయ్యారు. తెచ్చిన హెల్మెట్లను సైతం చూడకుండా వెళ్లిపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.






