- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పెద్దపీట
మహిళల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.

X
దిశ, ముషీరాబాద్ : మహిళల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. భోలకపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు అధ్యక్షతన గంగపుత్ర సంఘంలో జరిగిన మహిళా సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్, ఎన్నికల ఇంచార్జ్ లు ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎక్కాల కన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం వినూత్న పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. సంక్షేమం నిరాటంకంగా కొనసాగాలంటే బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రెబ్బ రామారావు, షరీఫుద్దీన్, జునేద్ బాగ్దాది, మనోహర్ చాంద్, ఏం శంకర్, మక్బూల్, శంకర్ గౌడ్, రహీం, సాయి తదితరులు పాల్గొన్నారు.
Next Story






