- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లిహిల్స్ లో 20 వేల నకిలీ ఓట్లు వేయించారు : BRS నేత RS ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 20 వేల నకిలీ ఓట్లు వేయించారని బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 20 వేల నకిలీ ఓట్లు వేయించారని బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేసారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్‌తో రేవంత్ రెడ్డి కుమ్మక్కై జూబ్లీహిల్స్ బైపోల్ లో అరాచకం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. బోగస్ ఓటింగ్ జరిగే ప్రాంతాలపై ఉదాహరణలతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసి అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీకి సూచించామని, షేక్ పేట్ డివిజన్‌లోని చాలా బూత్‌ల వద్ద అసలు బందోబస్తు పెట్టలేదన్నారు.
బోగస్ ఓటర్లు వివరాలను లైవ్‌గా చెప్పినా కూడా పోలీసులు వారి ఆపలేదని, ఎగ్జిట్ పాయింట్ వద్ద బోగస్ ఓటర్లను యధేచ్చగా అనుమతించారని ఫైర్ అయ్యారు. బోగస్ ఓటర్ల వద్ద ఒరిజినల్ ఐడీలు కాకుండా, జిరాక్స్ కాపీలు ఉన్నాయని, ఈ ఓటర్ పేరుకు అసలైన ఓటరు పేరుకు తేడా ఉందన్నారు. పోలీసులు, అధికారులు అవేమీ అడగకుండానే ఓట్లు వేయుంచారని ఆర్ఎస్పీ మండిపడ్డారు.






