మిస్ ఇంగ్లాండ్‌కు అవమానం.. ఖండించిన బీఆర్‌ఎస్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-25 16:40:56  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుణ్యమా అని భారత్ పరువు, తెలంగాణ పరువు అంతర్జాతీయంగా మసక బారిందని బీఆర్​ఎస్ ​మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, నాయకురాలు రజనీ సాయిచంద్ ఆరోపించారు...

మిస్ ఇంగ్లాండ్‌కు అవమానం.. ఖండించిన బీఆర్‌ఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుణ్యమా అని భారత్ పరువు, తెలంగాణ పరువు అంతర్జాతీయంగా మసక బారిందని బీఆర్​ఎస్ ​మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, నాయకురాలు రజనీ సాయిచంద్ ఆరోపించారు. పోటీల నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ ఇచ్చారు. అయితే ఆమెను వ్యభిచారిలా చూశారని, అతిథులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని మండిపడ్డారు. అవమానం జరిగిందంటూ మిస్ ఇంగ్లాండ్ మహిళ అర్థాంతరంగా తన దేశానికి వెళ్లిపోయింది. అయితే ఆదివారం తెలంగాణ భవన్‌లో గొంగిడి సునీత, రజనీ సాయిచంద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ సుందరి పోటీలకు ప్రభుత్వం అంత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, అయినా మిస్​వరల్డ్​అందాల పోటీలు అభాసుపాలయ్యారన్నారు. ముఖ్యంగా మహిళలని గౌరవించే తెలంగాణ గడ్డ మీద విదేశీ మహిళకు అవమానం జరిగిందని గొంగిడి సునిత, రజినీ సాయిచంద్​లు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ప్రభుత్వానికి తడిసిన వడ్లు కొనడం సాధ్యం కాదు, గురుకులాల సమస్యలు పరిష్కరించడం చేతకాదన్నారు. మిస్​వరల్డ్​అందాల పోటీల చుట్టూ సీఎం రేవంత్​తో పాటు పలువురు మంత్రులు తిరిగారని, అసలు అందాల పోటీల ప్రచారం లో సీఎం మంత్రుల ఫోటోలు అవసరమా? అని వారు నిలదీశారు. అది కూడా ఆరు సార్లు అందాల పోటీలకు సీఎం వెళతారా ? ఇదెక్కడి చోద్యం అని

నిలదీశారు. ఈ ఘటన తో ప్రపంచ దేశాల్లో మన పరువు పోయిందన్నారు. మన మహిళలకు అగౌరవం జరిగితే మనం చూస్తూ ఊరుకుంటామా ? ఆమెకు జరిగిన అవమానానికి ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అందాల పోటీలతో ఎక్కడైనా పెట్టుబడులు వస్తాయా ? ఇంతకన్నా నీచం ఇంకొకటి ఉంటుందా ? అని వారు విమర్శించారు. మిస్ ఇంగ్లాండ్ ను అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాని వారు డిమాండ్​చేశారు. తెలంగాణలో తమని ఆటబొమ్మలుగా చూశారని ఇంగ్లాండ్​సుందరి మెల్లీ వాపోయిందన్నారు. మహిళలను ఇలా అవమానిస్తే పెట్టుబడులు ఎలా వస్తాయని సీఎం రేవంత్​నుద్దేశించి ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఓ వైవు తమకు అప్పులు పుట్టడం లేదంటూ ఇంకో వైపు అందాల పోటీలతో పెట్టుబడులు వస్తాయని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. మిస్​వరల్డ్​నిర్వాకుల పై చర్యలు తీసుకోవాల్సిందే నంటూ మానవ హక్కుల కమిషన్ కు ఈ ఘటన పై ఫిర్యాదు చేస్తామని గొంగిడి సునిత, రజినీ సాయి చంద్​లు తెలిపారు. పరువు తీసే పనులు ఇప్పటికైనా మానండి అని చెబుతున్నామన్నారు. ఈ ఘటన పై మహిళా లోకం కూడా స్పందించాలని కోరుతున్నామన్నారు. మిస్ ఇంగ్లాండ్ అమ్మాయి ఇచ్చిన ప్రకటన చిన్నదేమీ కాదని గమనించాలన్నారు. మరి ఇదే అందాల పోటీల ప్రచార ప్రకటనల్లో మహిళా మంత్రుల ఫోటోలు ఎందుకు లేవు ? విదేశీ మహిళల కాళ్ళు కడిగించి ఇప్పటికే తెలంగాణ మహిళల పరువు తీశారని, ఇది మరువక ముందే మిస్ ఇంగ్లాండ్ అమ్మాయిపై అసభ్యకరంగా ప్రవర్తించారన్నారు. తెలంగాణ లో అసలు అందాల పోటీల నిర్వహణ ఆలోచనే తప్పు అని వారు అన్నారు. మిస్ ఇంగ్లాండ్ కు అవమానం జరిగిన తీరును ఖండిస్తున్నామన్నారు.

Next Story