BREAKING: హైదరాబాద్ ఎంపీ స్థానం బీజేపీదే: అభ్యర్థి మాధవీ లత హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

హైదరాబాద్ ఎంపీ స్థానం బీజేపీదేనని అభ్యర్థి మాధవీ లత సంచలన వ్యాఖ్యలు చేశారు.

BREAKING: హైదరాబాద్ ఎంపీ స్థానం బీజేపీదే: అభ్యర్థి మాధవీ లత హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఎంపీ స్థానం బీజేపీదేనని అభ్యర్థి మాధవీ లత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫలితం కోసం తాను ఉత్సాహంగా ఎదురుచుస్తున్నానని అన్నారు. దేశ ప్రజలంతా నరేంద్రమోడీనే ప్రధానిగా కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తించారని అందుకు తగినట్లుగానే ప్రధాని మోడీ కూడా అవిశ్రాతంగా పని చేస్తున్నారని అన్నారు. దేశ ప్రజలంతా ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అనే నినాదంతో బీజేపీ ఓట్లు వేశారని పేర్కొన్నారు. తాము హైదరాబాద్ సీటును గెలుచుకోవడంతో పాటు దేశంలో మోడీ 3.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మాధవీ లత అన్నారు.

Next Story