Hyderabad : మెట్రో 2nd ఫేజ్ కు బ్రేక్.. హైకోర్ట్ కీలక ఆదేశాలు

by Muthe.Rajitha |

హైదరాబాద్(Hyderabad) నగరంలో మెట్రో 2nd ఫేజ్(Metro 2nd Phase) పనులకు బ్రేక్ పడింది.

Hyderabad : మెట్రో 2nd ఫేజ్ కు బ్రేక్.. హైకోర్ట్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలో మెట్రో 2nd ఫేజ్(Metro 2nd Phase) పనులకు బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని హైకోర్ట్(High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో రెండవ దశ పనుల్లో భాగంగా పాతబస్తీ(Old City)లోని వారసత్వ కట్టడాల పరిరక్షణ చర్యలపై అధ్యయనం చేయకుండానే మెట్రో పనులు ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ.. యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ హైకోర్టులో పిల్(PIL) వేసింది. మెట్రో రెండవ దశ పనుల కారణంగా ఓల్డ్ సిటీలో వారసత్వ కట్టడాలైన చార్మినార్, ఫలక్ నుమా ప్యాలెస్, పురాణి హవేలి, మొగల్పురా టూంబ్ వంటి వాటికి ప్రమాదం పొంచి ఉందని కోర్టుకు విన్నవించారు.

హెరిటేజ్ రక్షణ, పర్యావరణ, పురావస్తు తదితర విభాగల నిపుణులతో కూడిన కమిటీతో అధ్యయనం చేయించాలని తెలిపారు. తెలంగాణ, కేంద్ర పురావస్తు శాఖల అనుమతులు తీసుకున్నాకే పనులు కొనసాగించేలా.. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని హైకోర్ట్ ఆదేశాలిచ్చింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

Next Story