ల‌డ్డూ ద‌క్కించుకున్న ముస్లిం...వ‌రుస‌గా రెండోసారి

by velandi.Saikiran |

వినాయక చవితి , నవరాత్రులలో భాగంగా ఓ ముస్లిం సోదరుడు లడ్డు ద‌క్కించుకున్నాడు. బోరబండ డివిజన్, రాజ్ నగర్ లోని

ల‌డ్డూ ద‌క్కించుకున్న ముస్లిం...వ‌రుస‌గా రెండోసారి
X

దిశ, జూబ్లీహిల్స్: వినాయక చవితి , నవరాత్రులలో భాగంగా ఓ ముస్లిం సోదరుడు లడ్డు ద‌క్కించుకున్నాడు. బోరబండ డివిజన్, రాజ్ నగర్ లోని "కింగ్స్ టీం ఆధ్వర్యంలో నెల‌కొల్పిన వినాయ‌కుడి ల‌డ్డూను ఓ ముస్లిం సోదరుడు ద‌క్కించుకున్నాడు. ఎన్ ఆర్ పురం సైట్ వన్ కాలనీకి చెందిన రియల్టర్ సయ్యద్ హమాన్ రసూల్ (హమ్ము ) 55వేలతో లడ్డును దక్కించుకున్నారు. దీంతో వ‌రుస‌గా రెండోసారి ల‌డ్డూను కొనుగోలు చేసిన‌ట్లు అయింది. ఈ కార్యక్రమంలో నగర బీసీ సంఘం కార్యదర్శి , తెలంగాణ రాష్ట్ర కల్లు గీత వృత్తిదారుల సంఘం కార్యదర్శి మహేష్ గౌడ్ కాసుల, యాదగిరి, సాయి ముదిరాజ్, రిచర్డ్, అమాన్,సాయి సింగ్,శుభం,చేతన్,హరీష్ రెడ్డి,అభిషేక్,రాహుల్, సతీష్, విజయలక్ష్మి, ఉమ,పింకీ తదితరులు పాల్గొన్నారు.

Next Story