Haryana Governor : బోనాల ఉత్సవాలు తెలంగాణలోనే ప్రత్యేకం..

by Batti.Sumithra |

ఆషాడమాసం బోనాల ఉత్సవాలలో భాగంగా చార్మినార్ శ్రీ భాగ్య లక్ష్మి, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు.

Haryana Governor : బోనాల ఉత్సవాలు తెలంగాణలోనే ప్రత్యేకం..
X

దిశ, చార్మినార్ : ఆషాడమాసం బోనాల ఉత్సవాలలో భాగంగా చార్మినార్ శ్రీ భాగ్య లక్ష్మి, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు తెలంగాణలోనే ప్రత్యేకం అన్నారు.

బోనాలు, బతుకమ్మ పండుగలు మహిళలు అమ్మవారిని ఆదరించే పండుగలన్నారు. పవిత్రమైన భావనతో బోనాలు సమర్పించి భవిషత్తుకు బంగారు బాట వేయాలని, అలాగే జీవితంలో వచ్చే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించాలన్నారు. తెలంగాణ ఇంకా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని, పాతబస్తీలో ప్రజలు శాంతి సామరస్యంగా, సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. మహిళలను గౌరవించడమే అమ్మవారి పట్ల మనకు ఉన్న నిజమైన భక్తి అని తెలిపారు.

Next Story