Bomb Threat : పటాన్‌చెరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూలుకు బాంబు బెదిరింపు

by Muthe.Rajitha |   (  Updated:2025-06-19 12:32:54  IST  )

పటాన్‌చెరు సమీపంలోని గాడియం ఇంటర్నేషనల్ స్కూలు(Guadium International School)కు గురువారం బాంబు బెదిరింపులు(Bomb Threat) వచ్చాయి.

Bomb Threat : పటాన్‌చెరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూలుకు బాంబు బెదిరింపు
X

దిశ, వెబ్ డెస్క్ : పటాన్‌చెరు సమీపంలోని గాడియం ఇంటర్నేషనల్ స్కూలు(Guadium International School)కు గురువారం బాంబు బెదిరింపులు(Bomb Threat) వచ్చాయి. మధ్యాహ్నం సమయంలో స్కూల్ ఆవరణలో బాంబు పెట్టినట్టు పాఠశాల యాజమాన్యానికి ఈ-మెయిల్ వచ్చినట్లు సమాచారం. అప్రమత్తమైన యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించగా.. అధికారులు, పటాన్‌చెరు పోలీసులు, బాంబు స్క్వాడ్‌లు స్కూల్‌కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. స్కూల్‌ను ఖాళీ చేయించి, విద్యార్థులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 3 గంటల తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.

ఈ బెదిరింపు కేవలం ఆకతాయిలు చేసిన పనిగా తేల్చారు. ఈ-మెయిల్ పంపిన వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన స్కూల్ యాజమాన్యాన్ని, విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనకు గురి చేసినప్పటికీ, పోలీసులు సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా ఇటీవల హైదరాబాద్, విశాఖపట్నంలోని పలు స్కూళ్లకు ఇలాంటి బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం సాధారణం అయింది.

Next Story