- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీ.ఎన్.రెడ్డినగర్ లో వాహనాల తనిఖీల్లో ఘరానా బైకు దొంగ అరెస్ట్
వనస్థలిపురం, మీర్‌పేట్, ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా బైక్ చోరీలకు పాల్పడుతున్న ఘరానా బైక్‌ల దొంగను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి 20 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

దిశ, వనస్థలిపురం : వనస్థలిపురం, మీర్‌పేట్, ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా బైక్ చోరీలకు పాల్పడుతున్న ఘరానా బైక్‌ల దొంగను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి 20 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి బీఎన్ రెడ్డిలో వెహికల్స్ చెక్ చేస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న కొర్ర సంతోష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ చోరీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీఐ రవిబాబు వివరాల ప్రకారం.. కొర్ర సంతోష్ (25), సైదాబాద్ సింగరేణి కాలనీలో నివాసముంటూ మేస్త్రి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పనులకు వెళ్లకుండా ఇంజాపూర్ కమాన్, గుర్రంగూడ క్రాస్ రోడ్, ఎల్‌బీనగర్ మెట్రో పార్కింగ్ ప్రాంతాల్లో పార్క్ చేసిన బైక్‌లే లక్ష్యంగా చేసుకుని గత కొన్ని నెలలుగా వరుస చోరీలకు పాల్పడుతున్నాడు.
దొంగిలించిన వాహనాల్లో కొన్నింటిని నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన శివ, మోహన్ అనే వ్యక్తులకు తక్కువ ధరలకు విక్రయించినట్లు విచారణలో తేలింది. మిగిలిన బైక్‌లను సింగరేణి కాలనీలోని తన ఇంటి సమీపంలో దాచి పెట్టాడు. నిందితుడి వద్ద నుంచి రూ.15 లక్షల విలువైన 20 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వీటిలో 12 బైక్‌లపై ఇప్పటికే వనస్థలిపురం, మీర్‌పేట్, ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు. మిగిలిన బైక్ యజమానులను గుర్తించి వారికి అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.






