- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పుట్టినరోజు వేడుకల్లో కత్తితో హంగామా

దిశ, వనస్థలిపురం : ఒక వ్యక్తి తన పుట్టిన రోజు సందర్భంగా పెద్ద కత్తితో కేకును కట్ చేసి ఇన్ స్టా గ్రామ్ లో ఇతరులను భయబ్రాంతులకు గురి చేసే విధంగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు.సమాచారం తెలుసుకున్న నాగోల్ పోలీసులు అతడి అడ్రస్ కనుక్కొని, అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నాడని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. నాగోల్ పరిధిలోని ఆనంద్ నగర్ - కృషి నగర్ కాలనీలో నివాసముంటున్న రాసునూరి అఖిల్(24) కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్లో పెద్ద కత్తితో కేకును కట్ చేసి, భయబ్రాంతులకు గురిచేసే ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. సమాచారం తెలుసుకున్న నాగోల్ పోలీసులు అతడి ఇంటిలో సోదా చేయగా, ఒక పొడవైన కత్తి లభించింది. అక్రమ ఆయుధాలు కలిగిన ఉన్నాడని పోలీసులు కేసు నమోదు, చేశారు. ఈ మేరకు అతడిని రిమాండ్ కి తరలించినట్లు సీఐ సూర్యానాయక్ తెలిపారు.