- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోపిడీ కోసం బర్త్ డే సెలబ్రేషన్స్
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ గల్ఫ్ కాలనీలో రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో దోపిడికి పాల్పడిన నేపాలీ ముఠాను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, సిటీక్రైం : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ గల్ఫ్ కాలనీలో రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో దోపిడికి పాల్పడిన నేపాలీ ముఠాను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్ మెట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సుమతి వివరాలను వెల్లడించారు. నేపాల్ కు చెందిన మీనా అలియాస్ మమత , రాజేష్ కొద్ది సంవత్సరాల కిందట భారత్ కు వచ్చారు. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో పని మనుషులుగా చేరి అక్కడక్కడా కొన్ని నెలల పాటు పని చేస్తూ ఇళ్లను మారుస్తున్నారు. ఇలా కొన్ని నెలల ముందే మమత, రాజేష్ లు భార్యభర్తలని నమ్మించి రిటైర్డ్ ప్రొఫెసర్ మురళి మోహన్ ఇంట్లో పనికి చేరి నమ్మకంగా ఉన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్నారని నిర్ధారించుకుని, ముందస్తుగా ఇంట్లో అన్నింటిని పరిశీలిస్తూ మమత ఇంట్లో భారీగా బంగారం, వెండి, నగదు ఉందని పసిగట్టింది. తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే దురాశతో మమత హైదరాబాద్ లో పని చేస్తున్న నేపాల్ కు చెందిన రాజేష్, సబీనా, చాంగ్, సామ్రాట్, బిశ్వాల్, కమల్, శంకర్ లతో కలిసి పథకం వేసింది.
దోపీడీ కోసం బర్త్ డే సెలబ్రేషన్స్ వేడుక
ఈనెల 11న దోపీడీకి స్పాట్ పెట్టుకున్న మమత అండ్ గ్యాంగ్. అవకాశం కోసం ఏకంగా మమత బర్త్ డే అని సృష్టించింది. సర్వెంట్ క్వార్టర్స్ లో వేడుకలను ఈ గ్యాంగ్ జరుపుకున్నారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఈ గ్యాంగ్ ఇంట్లోకి ప్రవేశించి మురళి మోహన్, అతని భార్య విజయలక్ష్మీలను బంధించి వారు అపస్మారక స్థితిలోకి వెళ్లేలా మత్తు పదార్ధాలను ఇచ్చారు. అనంతరం ఇంట్లోని అల్మారాలను పగులగొట్టి దాదాపు 60 తులాల బంగారం, 15 కేజీల వెండి, 3 వేల డాలర్ల నగదును దోపీడీ చేశారు. ఆ తర్వాత ఆటోలో కొంత మంది, స్కూటర్ పై మరికొంత మంది పరారయ్యారు. యాప్రాల్ కు చేరుకుని అక్కడ స్కూటర్ ను వదిలేసి రెండు ట్యాక్సీలు మాట్లాడుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చి పారిపోయారు. దోపీడీ విషయం తెలుసుకున్న అధికారులు నిందితులను పట్టుకునేందుకు మొత్తం ఆరు టీంలను ఏర్పాటు చేసి గాలింపును ముమ్మరం చేశారు. దాదాపు 250 సీసీ కెమెరాలను క్రోడీకరించి నిందితుల ఎస్కేప్ రూట్ ను పోలీసు ఫాలో అయ్యారు.
సంఘటన జరిగిన చోట వేలి ముద్రలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చోరీ చేసింది పాత నేరస్థురాలు మమత అలియాస్ మీనా గా గుర్తించారు. మమత గతంలో మొయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఓ చోరీ కేసులో అరెస్టైందని గుర్తించి అక్కడి వివరాలను సేకరించారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా శనివారం సునిత, బిశ్వాల్, కమల్ బహదూర్, శంకర్ లు సికింద్రాబాద్ రేతిఫై బస్సు స్టేషన్ వద్ద ఉన్నారని సమాచారం అందడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. చోరీ సోత్తును రికవరీ చేశారు. గ్యాంగ్ లీడర్ మమత, రాజేష్ లతో పాటు మరికొంత మంది పరారీలో ఉన్నట్లు పోలీసు కమిషనర్ వివరించారు. వారిని త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు.






