రెండు బైకులు ఢీ.. ఒకరు దుర్మరణం

by Bhanu |

రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందగా, మరొకరు ఐసీయూలో చికిత్స పొందుతున్న ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.

రెండు బైకులు ఢీ.. ఒకరు దుర్మరణం
X

దిశ, చైతన్యపురి : రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందగా, మరొకరు ఐసీయూలో చికిత్స పొందుతున్న ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మన్సురాబాద్ సౌత్ ఎండ్ పార్కుకు చెందిన అజ్మీరా రాజశేఖర్ ఈనెల 22న తన బైక్ తీసుకొని ఎల్బీనగర్ సిరీస్ రోడ్ నుంచి వెళ్తున్నాడు.ఈక్రమంలో అతడు దుర్గ బాణాసంచా షాప్ దగ్గరికి వెళ్లగా అటువైపు నుంచి గ్లామర్ ద్విచక్ర వాహనంపై గోపికృష్ణ అనే వ్యక్తి వేగంగా వచ్చి రాజశేఖర్ వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ఇరువురు కిందపడిపోయారు.ఈప్రమాదంలో రాజశేఖర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రమాదం జరిగిన విషయాన్ని రాజశేఖర్ తమ్ముడికి సమాచారం అందించారు.


ఘటనా స్థలానికి చేరుకున్న తమ్ముడు గాయపడిన అన్నను కామినేని హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం చేర్పించారు. అనంతరం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ చికిత్స పొందుతున్న అజ్మీర రాజశేఖర్ మృతి చెందినట్లు డాక్టర్లు పోలీసులకు శుక్రవారం సమాచారం అందించారు. రాజశేఖర్ బైకును ఢీ కొట్టిన గోపికృష్ణ కూడా కామినేని హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story