IPL పై బిగ్ అప్డేట్

by Muthe.Rajitha |

భారత్ పాక్ యుద్ధం(Inida Pakistan War) నేపథ్యంలో బీసీసీఐ IPL ను నిరవధికంగా వాయిదా(IPL Postponed) వేసిన సంగతి తెలిసిందే.

IPL పై బిగ్ అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ పాక్ యుద్ధం(Inida Pakistan War) నేపథ్యంలో బీసీసీఐ IPL ను నిరవధికంగా వాయిదా(IPL Postponed) వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించడంతో తిరిగి ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ(BCCI) కసరత్తు ప్రారంభించింది. భీకర ఎక్కువ రోజులు కొనసాగితే ఈ సీజన్లో మిగిలిన మ్యాచులను ఇతర దేశాల్లో నిర్వహించాలని తొలుత ఆలోచన చేసినప్పటికీ.. వార్ త్వరగానే ఓ కొలిక్కి రావడంతో మిగిలిన మ్యాచులను భారత్ లోనే నిర్వహించేందుకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మిగతా షెడ్యూల్ ఖరారుపై నేడు కీలక సమావేశం నిర్వహించనుంది.

దీనిపై ఇప్పటికే రెండు వేర్వేరు షెడ్యూల్స్ రెడీ చేసినట్టు సమాచారం. ఈ షెడ్యూల్స్ పై కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే.. తిరిగి ఐపీఎల్ సందడి మొదలవనుంది. మొదటి షెడ్యూల్ లో ముందు ఖరారు చేసిన అన్ని వేదికల్లో నిర్వహించడం. రెండవ షెడ్యూల్ లో కొన్ని సురక్షిత వేదికల్లో మాత్రమే ఆటను కొనసాగించడం. ఈ సీజన్ ముగిసేలోగా భారత్ పాక్ మధ్య మళ్ళీ యుద్ధం సంభవిస్తే.. ఆటలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండాలని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Next Story