నీ ఇంట్లోనే చంపేస్తాం.. టీడీపీ నేతకు బెదిరింపు లేఖ

by Vemula.Srinu Prasad |

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి స్పీడ్ పోస్టు ద్వారా ఒక బెదిరింపు లేఖ వచ్చింది. ..

నీ ఇంట్లోనే చంపేస్తాం.. టీడీపీ నేతకు బెదిరింపు లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కడప జిల్లా(Ysr Kadapa District) ప్రొద్దుటూరు(Proddatur)కు చెందిన తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(Praveen Kumar Reddy)కి స్పీడ్ పోస్టు ద్వారా ఒక బెదిరింపు లేఖ వచ్చింది. ఈ లేఖలో తనను ప్రాణాలతో విడిచిపెట్టబోమంటూ గుర్తుతెలియని వ్యక్తులు హెచ్చరించినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. గతంలో తన తాతను ఏ విధంగానైతే అంతమొందించారో, అదే తరహాలో తనను కూడా హతమారుస్తామని ఆ లేఖలో రాశారని ఆయన పేర్కొన్నారు.

ఇంట్లోనే చంపేస్తాం..

తనను సొంత ఇంట్లోనే చంపేస్తామంటూ లేఖలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వివరించారు. అయితే ఇటువంటి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తన జోలికి వస్తే చూస్తూ ఊరుకోనని, ఎంతటివారైనా సరే ఎదుర్కొంటానని ఈ ఆయన హెచ్చరించారు.

స్థానిక పోలీసులకు ఫిర్యాదు

ఈ ప్రాణాపాయ బెదిరింపుల ఉదంతంపై ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనకు వచ్చిన బెదిరింపు లేఖను ఆధారంగా చేసుకుని ఆయన స్థానిక పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, లేఖ పంపిన దుండగులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

Next Story