Meerpet Murder Case : మీర్‌పేట్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్

by M.Rajitha |
Meerpet Murder Case : మీర్‌పేట్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్‌పేట్ మర్డర్ కేసు(Meerpet Murder Case)లో బిగ్ ట్విస్ట్(Big Twist) చోటు చేసుకుంది. డీఆర్డీవో(DRDO)లో విధులు నిర్వర్తించే గురుమూర్తి(Gurumurti) అనే వ్యక్తి తన భార్య వెంకటమాధవి(VenkataMadhavi)ని ముక్కలుగా నరికి చంపి, శరీర భాగాలను కాల్చి పొడి చేసి పారవేశాడు. కాగా ఈ కేసులో గురుమూర్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు.. హత్య చేసిన విధానాన్ని చూసి షాక్ అయ్యారు. అయితే పోలీసుల దర్యాప్తులో మరో సంచలన నిజం బయటపడినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ హత్య అతనొక్కడే చేసినట్టు భావిస్తుండగా.. ఈ హత్యలో మరో ముగ్గురి హస్తం ఉన్నట్టు గురుమూర్తి పోలీసులకు వెల్లడించాడు. వెంకటమాధవి హత్య కేసులో ఇద్దరు మహిళలు తనకు సహాకరించినట్టు పోలీసులకు తెలియజేశాడు. కాగా వారు ముగ్గురి ఆచూకీ కోసం వెతకగా.. వారు పరారీలో ఉన్నట్టు సమాచారం. కాగా ఆ ముగ్గురిలో ఒకరు గురుమూర్తి తల్లి కాగా, మరొకరు గురుమూర్తి ప్రియురాలిగా గుర్తించారు. ఇక మూడో వ్యక్తి ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. శనివారం నుంచి పోలీసులు గురుమూర్తిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తుండగా.. మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Next Story

Most Viewed