- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Big Twist : అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్
అఫ్జల్‌గంజ్ కాల్పుల(Afjalgunj Firing) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : అఫ్జల్‌గంజ్ కాల్పుల(Afjalgunj Firing) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతనెలలో అఫ్జల్‌గంజ్ లో కాల్పులకు పాల్పడ్డ ఘటనలో పోలీసులు కీలక నిందితులను గుర్తించారు. నిందితులు బీహార్(Bihar) కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్ గా నిర్దారించారు. కాగా గత డిసెంబర్లో కాల్పుల ఘటన జరిగిన అనంతరం 4 రాష్ట్రాల పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. అఫ్జల్‌గంజ్ కాల్పులు జరిపిన తరువాత నిందితులు ఏపీకి పారిపోయి అక్కడి నుంచి చెన్నైకి, బీదర్ కు పారిపోయినట్టు కనుక్కున్నారు. ఈ గ్యాంగ్ కోసం ఏడాది కాలంగా యూపీ పోలీసులు కూడా గాలిస్తున్న విషయం తెలుసుకొని, సంయుక్త ఆపరేషన్స్ చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు మీడియాకు తెలియజేశారు. ప్రాథమికంగా పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం ఈ కేసులోని ఇద్దరి నిందితులపై గతంలో కూడా బీహార్, యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరు రోజుల తరబడి హై-వేల పై తిరుగుతూ ఏటీఎం కేంద్రాలతో పాటు రాత్రి సమయంలో హైవేలపై కుటుంబాలతో వెళ్ళే వారితో పాటు ఇతరులను టార్గెట్ చస్తారని తెలిసింది.
విచారణ సాగిందిలా..
గత ఏడాది డిసెంబర్ 20వ తేదీ తర్వాత దుండగులు భారీ దోపిడీలకు ప్లాన్ వేసుకుని బీహార్ రాష్ట్రం హాజీపూర్ ప్రాంతం నుంచి టూ వీలర్ పై బయలుదేరారు. దాదాపు 2500 కిలోమీటర్ల పైన ద్విచక్రవాహనంపై తిరుగుతూ చివరకు జనవరి 16న బీదర్ లో ఓ ఏటీఎం వద్ద ఏటీఎమ్ మెషీన్ లో డబ్బులను డిపాజిట్ చేయడానికి వచ్చిన ఏజెన్సీ వారిపై కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. వారి వద్ద నుండి దాదాపు 93 లక్షల రూపాయాలను దోచుకుని టూ వీలర్ పై హైదరాబాద్ కు చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం అఫ్జల్ గంజ్ రోషన్ ట్రావెల్స్ వద్ద కాల్పులు జరిపి పారిపోయిన విషయం తెలిసిందే. ఇలా ఈకేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ పోలీసులు రోజుకో క్లూను సంపాదిస్తు చివరకు దుండుగులు ఎవరనేది గుర్తించి, అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
500 లకు పైగా సీసీ కెమెరాలు జల్లెడ
అఫ్జల్ గంజ్ కాల్పులతో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ లో కీలకమైన అన్ని విభాగాలు రంగంలోకి దిగాయి. అఫ్జల్ గంజ్ నుంచి మొదలు పెట్టి దుండగులు తెలంగాణ రాష్ట్రం దాటే వరకు రూట్ లోని దాదాపు 500 నుంచి 800 సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. కొన్ని వందల గంటల సీసీ కెమెరాల ఫుటేజీని వీక్షించారు. అలా సీసీ ఫుటేజీని చూస్తున్న సమయంలో దొరికిన క్లూలను విశ్లేషించుకుని దర్యాప్తును ముందుకు తీసుకు వెళ్ళగా దుండుగులు బీహారలోని హాజీపూర్ కు చెందిన వారుగా ప్రాథమికంగా గుర్తించారు. అలా కొన్ని టీంలు ప్రస్తుతం హాజీపూర్ లో మకాం వేసి వారిని పట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. మరికొన్ని టీంలు వారి ఎస్కేప్ రూటును ఫాలో అవుతున్నారు.
పట్టించిన బైక్ ఛేసీస్ నెంబరు
దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ పోలీసులు ప్రాథమికంగా సాంకేతికంగా దర్యాప్తు చేసినప్పటికి వారికి కీలక క్లూ లభించలేదు. దీంతో రివర్స్ ఇన్వెస్టిగేషన్ ను ప్రారంభించగా కాల్పులకు పాల్పడ్డ దుండగులు బీదర్ నుంచి వచ్చి ఉపయోగించిన ద్విచక్రవాహనాన్ని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ పార్కింగ్ లో పార్క్ చేసినట్లు గుర్తించారు. ఆ వాహనానికి ఉన్న నెంబరు ప్లేట్ ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉండడంతో ఆ నెంబరు, దానికి లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబరు ఇతర పత్రాలను పరిశీలించగా ఏమి ఆధారం దొరకలేదు. చివరకు ద్విచక్రవాహనానికి ఉన్న ఛేసీస్ నెంబరును స్క్రాచ్ చేసి చూడగా పోలీసులకు బీహార్ ఆచూకీని చూపించింది. ఛేసీస్ నెంబరు ఆధారంగా చూస్తే పోలీసులకు టూవీలర్ యజమాని అడ్రస్సును బీహార్ లోని హాజీపూర్ లో చూపించింది. దుండగుల ఫోటోను హాజీపూర్ లో టూ వీలర్ యజమానికి చూపించగా అవును ఈ వాహనం నాదే...గత ఏడాది డిసెంబరులో తెలిసి ఇద్దరు యువకులు నెల రోజులు వాహనం కావాలని తీసుకువెళ్లారని క్లారిటీ ఇచ్చాడు. అప్పుడు పోలీసులకు కాల్పులకు పాల్పడ్డ దుండగుల హిస్టరీ మొత్తం తెలిసిపోయింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు వివరాలను గోప్యంగా పెడుతున్నారు. దుండగులను పట్టుకున్న తర్వాత మొత్తం వివరాలను పోలీసులు స్పష్టం చేయనున్నారు.






