నగర ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో రెండు గంటల్లో ఈ ప్రాంతంలో వర్షం

by Malleboina Mahesh |

మరో రెండు గంటల్లో నగరంలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని వెదర్ మ్యాన్ అలర్ట్ ప్రకటించారు.

నగర ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో రెండు గంటల్లో ఈ ప్రాంతంలో వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహానగర ప్రజలకు వెదర్ మ్యాన్ రెయిన్ అలర్ట్ (Weatherman Rain Alert) ప్రకటించారు. మరో రెండు గంటల్లో నగరంలో భాగం అయిన ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, బడంగ్ పేట్, మీర్ పేట్, బీఎన్ రెడ్డి, ఉప్పల్, నాగోల్, అంబర్ పేట్, నాంపల్లి, అసెంబ్లీ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. అలాగే సాయంత్రం తర్వాత నగరం మొత్తం వర్షం (rain) కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మెడిపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. మరికొద్ది సేపట్లో ముందస్తు అంచనా మేరకు వివిధ ప్రాంతాలకు వర్షం విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆకస్మికంగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు రావడం తో వాహనదారులు, ప్రజలు అసహనానికి గురవుతున్నారు.

Next Story