26 బీసీ కులాలను తెలంగాణలో చేర్చే నిర్ణయాన్ని బీసీ కమిషన్ పునఃసమీక్షించాలి

by Naveena |

ఏపీకి చెందిన 26 బీసీ కులాలను తెలంగాణలో చేర్చే నిర్ణయాన్ని బీసీ కమిషన్ పునసమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు.

26 బీసీ కులాలను తెలంగాణలో చేర్చే నిర్ణయాన్ని బీసీ కమిషన్ పునఃసమీక్షించాలి
X

దిశ, హిమాయత్ నగర్ : ఏపీకి చెందిన 26 బీసీ కులాలను తెలంగాణలో చేర్చే నిర్ణయాన్ని బీసీ కమిషన్ పునసమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఎమ్మెస్ నరహరి ఆధ్వర్యంలో.. జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన బీసీ కులాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో ఆంధ్ర బీసీ కులాలను తీసుకొచ్చి తెలంగాణ బీసీ కులాలలో కలప26 బీసీ కులాలను తెలంగాణలో చేర్చే నిర్ణయాన్ని బీసీ కమిషన్ పునఃసమీక్షించాలిడం సమంజసమని ప్రశ్నించారు. ఏపీకి చెందిన కొంతమంది పనిగట్టుకొని రాష్ట్ర బీసీ 'ఏ' కులాలలోకి ప్రయత్నించడం బాధాకరమన్నారు.

ఇక్కడ ఉన్న తెలంగాణ బీసీ కులాలను ఏపీలోని బీసీ కులాల్లో చేర్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా అని ఎదురు ప్రశ్నించారు. ఒకవేళ 26 బీసీ కులాలను తెలంగాణ ప్రభుత్వం చేర్చాలనుకుంటే.. ఈడబ్ల్యూఎస్ చేర్చండని, తమకు అభ్యంతరం లేదని మల్లన్న తెలిపారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం ఉల్లంఘించడం మంచిదకాదన్నారు. బీసీ కులాల మధ్య పంచాయతీ పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో బీసీ నేతలు డా. భాగయ్య, కే. రామచందర్, ప్రొ. సాంబయ్య, ప్రొ. సాంబమూర్తి, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Next Story