- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాలల్లో బతుకమ్మ సందడి.. విద్యార్థినీలతో ఆడిపాడిన టీచర్స్
తెలంగాణలో బతుకమ్మ సంబురాలు షురూ అయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బతుకమ్మ సంబురాలు షురూ అయ్యాయి. విద్యాసంస్థలకు ఈ నెల 13 నుంచి దసరా పండుగ సెలవులు ఇస్తున్నందున పాఠశాలలు, కాలేజీల్లో ముందస్తుగా బతుకమ్మలను చేశారు. విద్యార్థినీలతో కలిసి టీచర్స్ సంబురాల్లో పాల్గొన్నారు. స్కూల్లోని అమ్మాయిలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గ్రౌండ్‌లో ఆటపాటలతో సంబురాలు చేసుకున్నారు. బతుకమ్మల చుట్టు తిరుగుతూ ఆడిపాడారు. ఇందులో భాగంగా బుధవారం చైతన్యపురి ఆర్‌కే పురంలోని నారాయణ హైస్కూల్‌లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీలతో ప్రిన్సిపల్ నీరజ, వైస్ ప్రిన్సిపల్ స్వర్ణలత కాలు కలిపారు. టీచర్స్ శ్రావణి, లావణ్య, శైలజ, సమీర, శ్వేత విద్యార్థినీలతో కలిసి దాండియా ఆడారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం హేమంబర్, రీవిజినల్ ఇన్ చార్జ్ రవి ప్రసాద్, ఏఓ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






