బావను చంపిన బావమరిది..

by Kodari Anjali |

చెల్లెను వేధిస్తున్నాడని బావను హత్య చేసిన ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

బావను చంపిన బావమరిది..
X

దిశ, కార్వాన్: పెండ్లి చేసుకున్న భార్యను వేధిస్తున్నాడని బావమరిది బావను హత్య చేసిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గోల్కొండ ఏసీపీ ఫయాజ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గోల్కొండ కుమ్మరి వాడి ప్రాంతానికి చెందిన చాంది షేక్ మసూద్ (25) ఎలక్ట్రిషన్ పని చేస్తూ, యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నాడు. అయితే గత రెండు సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలోని సోహేల్ చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక సంవత్సరం బాలుడు కూడా ఉన్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి భార్యను వేధిస్తుండడంతో పుట్టింటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే తన చెల్లిని వేధిస్తున్నాడని సోహెల్‌తో పాటు మరో ముగ్గురు శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో మసూద్ ఇంటికి వచ్చి, రాడ్లతో, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మసూద్ అక్కడికక్కడే మృతి చెందగా, మసూద్ తండ్రికి గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story