- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ టికెట్ల కోసం నకిలీ అధికారుల అవతారం
ఐపీఎల్ టికెట్ల కోసం నకిలీ అధికారుల అవతారమెత్తిన ముఠాను HCA, మల్కాజిగిరి పోలీసులు జాయింట్ అపరేషన్ లో అదుపులోకి తీసుకున్నారు.

దిశ, సిటీక్రైం : ఐపీఎల్ టికెట్ల కోసం నకిలీ అధికారుల అవతారమెత్తిన ముఠాను హెచ్ సీఏ, మల్కాజిగిరి పోలీసులు జాయింట్ అపరేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వర్గాల సమాచారం మేరకు...ఐపీఎల్ టిక్కెట్ల కోసం గత కొద్ది రోజుల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తాము తమిళనాడు, ముంబయి క్రికెట్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నామని హెచ్ సీఏ అధికారులకు ఫోన్ లు చేసి సతాయించారు. మరికొన్ని సందర్భాల్లో వారు తాము పీఎంఓ ఆఫీసు, గవర్నర్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. దీని కోసం కొన్ని ఫేక్ లెటర్లను కూడా రూపొందించి వాటిని హెచ్ సీఏకు పంపారు. ఈ లేఖలు నకిలీవి అని గుర్తించిన హెచ్ సీఏ ప్రతినిధులు విషయాన్ని మల్కాజిగిరి పోలీసు కమిషనర్ సుమతి దృష్టి కి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో HCA, మల్కాజిగిరి పోలీసులు జాయింట్ అపరేషన్ ను నిర్వహించి వారికి టిక్కెట్ లను ఎర వేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఎస్బీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, తదుపరి దర్యాప్తు కోసం ఎస్‌ఓటీ పోలీసులకు అప్పగించారు. ఉప్పల్ ఎస్‌ఓటీ, ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తూ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిండుతుడు ప్రకాశం జిల్లా కందుకూరు కు చెందిన అశోక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితున్ని ఉప్పల్, ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు విచారిస్తున్నారు.ఈ ముఠాలో మరికొందరు సభ్యులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.






