- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచి సన్న బియ్యం పంపిణీ..మూడు నెలలవి ఒకేసారి!
ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు సన్న బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ దుకాణాల ద్వారా ఆహార భద్రతా కార్డులున్న వారికి జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి మూడు నెలల సన్నబియ్యం

దిశ , హైదరాబాద్ బ్యూరో : ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు సన్న బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ దుకాణాల ద్వారా ఆహార భద్రతా కార్డులున్న వారికి జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి మూడు నెలల సన్నబియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 6,47,282 ఆహార భద్రతా కార్డులుండగా.. మొత్తం 24,24,,824 మంది లబ్ధిదారులున్నారు. ఇందులో భాగంగా జూన్ నెలలోనే 45,259.677 మెట్రిక్ టన్నుల బియ్యం, 9,709.230 మెట్రిక్ టన్నుల గోధుమలు, 88.695 మెట్రిక్ టన్నుల పంచదార రేషన్ దుకాణాలకు చేరుకుంది. ఆహారభద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున మూడు నెలలకు గాను 18 కిలోల బియ్యం, అంత్యోదయ కార్డుదారులకు ఒక్కొక్కరికి 35 కిలోల లెక్కన మూడు నెలలకుగాను 105 కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డుదారులకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున మూడు నెలలకు 30 కిలోల బియ్యం ఇవ్వనున్నారు. వీటితో పాటు ప్రతికార్డు దారుడికి నెలకు 5 కిలోల చొప్పున మూడు నెలలకు 15 కిలోల గోధుమలు కిలో రూ.7 చొప్పున , రూ.13.50కు కిలో పంచదార నెలకు ఒక కిలో లెక్కన మూడు నెలలకు మూడు కిలోలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
మూడు నెలలకు విడిగా ఈపీఓస్ రసీదులు
జిల్లాలో ఆహార భద్రతా కార్డుదారులందరికీ పంపిణీ సమయంలో ఈ పీవోస్ రసీదులు మూడు నెలలకు విడిగా ఇస్తారు. చౌక ధరల దుకాణాల్లో ఆహార ధాన్యాలకు సంబంధించిన ఈపీఓస్ బయోమెట్రిక్ ప్రామాణీకరణగా జూన్, జూలై, ఆగస్టు మూడు నెలలకు విడిగా ఇస్తారు. హైదరాబాద్ జిల్లాలోని అన్ని ఆహార భద్రతా కార్డుదారులు తమ సమీప అనుకూలమైన చౌక ధరల దుకాణంలో తమ రేషన్ పొందడానికి ఈ పోర్టబిలిటీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి.
- రమేశ్, జిల్లా పౌర సరఫరాలశాఖాధికారి






