- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవీంద్రభారతిలో అటుకుల బతుకమ్మ వేడుకలు..
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు రవీంద్రభారతిలో రెండవ రోజు అటుకుల బతుకమ్మతో సందడిగా సాగాయి.

రవీంద్రభారతిలో అటుకుల బతుకమ్మ వేడుకలు..
- రెండో రోజు ఆడి పాడిన మహిళలు, కళాకారులు
- ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ : డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి
దిశ, రవీంద్ర భారతి : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు రవీంద్రభారతిలో రెండవ రోజు అటుకుల బతుకమ్మతో సందడిగా సాగాయి. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను మహిళలు ఘనంగా నింపి పాటలు పాడుతూ ఆడిపాడారు. సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే ఈ వేడుకలో మహిళల ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో బాలబతుకమ్మ, పాటలు, నృత్యాలతో పాల్గొన్న వారంతా ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. మహిళలతో పాటు చిన్నారులు, కళాకారులు, విద్యార్థులు బతుకమ్మ చుట్టూ ఆడుతూ వాతావరణాన్ని మరింత రంజింపజేశారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. "బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే ఉత్సవం. తల్లిదనాన్ని, సహజసిద్ధతను, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే ఆచారంగా ఇది నిలుస్తుందని అన్నారు. తెలంగాణకు మాత్రమే సొంతమైన పండుగలు బతుకమ్మ, బోనాలు అని గుర్తుచేశారు. పూలను పూజిస్తూ జరుపుకునే పండుగ బతుకమ్మ అని డైరెక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి బలాచారి, భాషా సాంస్కృతిక శాఖ ఫీల్డ్ ఆఫీసర్ పి.నర్సింహులు, సూపరింటెండెంట్ కె. ప్రసాద్ బాబు, జే. శ్రీనివాస్, హేమలత, సరోజినీ, స్రవంతి, రవి, లతో పాటు భాషా సాంస్కృతిక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.






