అటెండ‌ర్ పై సెక్యూరిటీ సిబ్బంది దాడి

by Ratna Kumari |

ఆసుప‌త్రికి వ‌చ్చిన ఓ అటెండ‌ర్ పై ఆసుప‌త్రి సెక్యూరిటీ సిబ్బంది దాడి చేసిన ఘ‌ట‌న నిలోఫ‌ర్ ఆసుప‌త్రిలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

అటెండ‌ర్ పై సెక్యూరిటీ సిబ్బంది దాడి
X

దిశ, కార్వాన్ : ఆసుప‌త్రికి వ‌చ్చిన ఓ అటెండ‌ర్ పై ఆసుప‌త్రి సెక్యూరిటీ సిబ్బంది దాడి చేసిన ఘ‌ట‌న నిలోఫ‌ర్ ఆసుప‌త్రిలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఏప్రిల్ 27న ఓ మ‌హిళా అటెండ‌ర్ సెక్యూరిటీ హీరా అనే మ‌హిళా సిబ్బంది మ‌ధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. వీరిద్ద‌రూ పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. దీంతో సెక్యూరిటీ మ‌హిళా సిబ్బందిని రెండు రోజుల కింద‌ట విధుల్లో నుంచి తొల‌గించిన‌ట్టు స‌మాచారం. ఇలాంటివి పున‌రావృతం కాకుండా సెక్యూరిటీ ఏజెన్సీ పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించినట్టు ఆర్ఎంఓ డాక్ట‌ర్ ఆనంద్ తెలిపారు. ఆ అటెండ‌ర్ కి సంబంధించిన వివ‌రాలు మాత్రం తెలియ‌రాలేదు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Next Story