వివాహిత పై లైంగిక దాడి యత్నం

by Ratna Kumari |

వివాహిత పై లైంగిక దాడికి య‌త్నం చేసిన సంఘ‌ట‌న వారాసిగూడ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది

వివాహిత పై లైంగిక దాడి యత్నం
X

దిశ, సీతాఫలమండి : వివాహిత పై లైంగిక దాడికి య‌త్నం చేసిన సంఘ‌ట‌న వారాసిగూడ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఓ వివాహిత మ‌హిళ‌(29) త‌న భ‌ర్త అర‌వింద్, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి గంగ‌పుత్ర కాల‌నీలో నివాసం ఉంటుంది. రాంన‌గ‌ర్ మోహ‌న్ న‌గ‌ర్ కి చెందిన రాజు అనే వ్య‌క్తితో ఆమె భ‌ర్త‌కు నాలుగేళ్ల క్రితం ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యంతో భ‌ర్త మ‌ద్యానికి బానిసై త‌రుచూ మ‌ద్యం సేవించి ఇంటికి వ‌చ్చి భార్య‌ను వేధించేవాడ‌ని స‌మాచారం. ఈ స‌మ‌స్య పై ప‌లుమార్లు కుటుంబ స‌భ్యులు భ‌ర్త‌ను స‌రిదిద్దేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది.

దీంతో బాధితురాలు త‌ల్లి రాజును ప్ర‌శ్నించింది. దీంతో రాజు క‌క్ష్య పెంచుకొని బాధితురాలు త‌ల్లి పై దుర్భాషతో దూషించాడు. ఏప్రిల్ 02న రాజు త‌న భార్య సింధూతో క‌లిసి బాధితురాలు ఇంటికి వెళ్లి అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తూ గొడ‌వ‌కు దిగారు. రాజు బాధితురాలును త‌న్న‌డం, లాగ‌డం వంటివి చేయ‌గా.. సింధు ఆమె జుట్టు ప‌ట్టుకొని కొట్టిన‌ట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు పై దాడి చేసి కొరికి గాయ‌ప‌ర‌చ‌డంతో పాటు చంపేస్తామంటూ బెదిరించిన‌ట్టు ఆరోపించారు. బాధితురాలును ఇంట్లోకి లాక్కెళ్లి అస‌భ్యంగా తాకుతూ అత్యాచార య‌త్నం చేసిన‌ట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా ఆ ప్రాంతంలో భ‌యాందోళ‌న నెల‌కొంది. మ‌హిళ‌ల భ‌ద్ర‌త పై స్థానికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story