హైదరాబాద్‌లో దారుణం.. గంజాయి మత్తులో 8 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి

by Gugulothu.Kavitha |   (  Updated:2025-10-10 07:57:21  IST  )

హైదరాబాద్‌ నగరంలోని సైదాబాద్‌ పరిధిలోని సింగరేణి కాలనీలో ఘోర ఘటన చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లో దారుణం.. గంజాయి మత్తులో 8 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి
X

దిశ, చంపాపేట్: హైదరాబాద్‌ నగరంలోని సైదాబాద్‌ పరిధిలోని సింగరేణి కాలనీలో ఘోర ఘటన చోటుచేసుకుంది. గంజాయి మత్తులో మునిగి పోయిన ఒక యువకుడు మానవత్వాన్ని మరిచి, ఎనిమిదేళ్ల పాపపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న దంపతులు ప్రతి రోజు పనికి వెళ్లే సమయంలో తమ ఇద్దరు పిల్లలను కూతురు(8), కుమారుడు(7) ఇంట్లోనే ఉంచేవారు. ఈ క్రమంలో, పరిచయమున్న యువకుడు పిల్లలను ఇంటికి పిలిచి, సోదరుడి ముందే బాలికపై దారుణానికి పాల్పడ్డాడని అనంతరం ఎవరికైనా విషయం చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపారు.

దీంతో భయంతో నోరు మూసుకున్న చిన్నారులు కొద్ది రోజుల తర్వాత బాలిక అనారోగ్యానికి గురయ్యింది. తల్లిదండ్రులు విచారించగా, చిన్నారి తమ్ముడు ఘటన వివరాలు చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహాయంతో సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సాక్ష్యాలను సేకరించగా, స్థానికులు నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read More: నవరాత్రి జాతరలో దారుణం.. గిరిజన బాలికలను కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం

Next Story